Telangana IT Minister KT Rama Rao participated in election campaign in Khairatabad on Monday. He said that many CM candidates are there in Congress Party.
#kcr
#ktr
#trs
#congress
#harishrao
#tdp
#chandrababu
#telanganaelections2018
కేసీఆర్‌ను ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయని, వాటిని ప్రజలు తిప్పికొట్టాలని మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. సోమవారం దానం నాగేందర్‌కు మద్దతుగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కూటమి గెలిస్తే నెలన్నరకో ముఖ్యమంత్రి మారుతాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వంటి సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుందని చెప్పారు. మహాకూటమి సీఎంను నిర్ణయించాలంటే ఢిల్లీ నుంచి నిర్ణయించాలని, అదీ సీల్డ్ కవర్‌లో వస్తుందని చెప్పారు. తెలంగాణకు సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కావాలా లేక కేసీఆర్ వంటి దమ్మున్న నేత కావాలా అన్నారు.